Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూకే నుంచి తెలంగాణకు 1216 మంది.. 30మంది జాడ లేదు.. టెన్షన్

Written By సెల్వి
Updated: సోమవారం, 28 డిశెంబరు 2020 (09:53 IST)
యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో ఇప్పటివరకు 18 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆదివారం మరో ఇద్దరికి కూడా వైరస్ సోకింది. దీంతో కొత్తగా కరోనాబారిన పడినవారి సంఖ్య ఇరవైకు చేరుకుంది. వీరికి తోడు మరో ముగ్గురు ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. 
 
బ్రిటన్ నుంచి డిసెంబరు 9 తర్వాత శంషాబాద్ విమానాశ్రయానికి మొత్తం 1216 మంది ప్రయాణికులు వచ్చారని, ఇందులో 92 మంది వివిధ రాష్ట్రాలకు చెందినవారు కావడంతో అక్కడికి వెళ్ళిపోయారని, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు వివరాలు అందించి అప్రమత్తం చేశామని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 
 
అయితే శనివారం వరకూ 184 మంది వివరాలు అందలేదని, అందులో 30 మంది జాడ కనిపెట్టడంతో ఇంకా 154 మంది గురించి వెతుకుతున్నట్లు తెలిపారు. కొత్తగా వైరస్ వచ్చిన ఇద్దరూ మల్కాజిగిరి జిల్లాకు చెందినవారని తెలిపారు.
 
దీంతో ఇప్పటివరకు కొత్తగా వైరస్ బారిన పడిన ఇరవై మందిలో నలుగురు హైదరాబాద్, ఎనిమిది మంది మల్కాజిగిరి, ఇద్దరు జగిత్యాల జిల్లాలకు చెందినవారు కాగా మిగిలినవారు మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందినవారని వివరించారు.

అన్నీ చూడండి

తస్సదియ్యా పాట సమయంలో సమంత ప్రెగ్నెంట్ న్యూస్ వచ్చింది.. మాతృత్వంపై...?

త్రివిక్రమ్ సమర్పణలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ అంశ్ రాబోతోంది

బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

Vijay Deverakonda: నేను Unhype అనే మంచి స్కిన్ కేర్ వాడుతున్నా: విజయ్ దేవరకొండ

ఎపిక్..ఐదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అంటున్నారు : ఆనంద్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments