శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (10:20 IST)

హర్యానా: రెవాడీలో 80మంది విద్యార్థులకు కరోనా

కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభమైనాయి. అయితే పాఠశాలలు ప్రారంభమైనా.. కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా సోకుతోంది. 
 
తాజాగా హార్యానాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రెవాడీలోని ఐదు ప్రభుత్వ పాఠశాలలు, మూడు ప్రైవేట్ పాఠశాలకు చెందిన 80 విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో జిల్లా విద్యాశాఖలో కలకలం చెలరేగింది. ఆయా స్కూళ్లను 15 రోజుల పాటు మూసివేయడంతో పాటు, శానిటైజ్ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. హర్యానా సర్కారు జారీచేసిన గైడ్‌లైన్స్ ప్రకారం నవంబరు 2 నుంచి 9 వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ పాఠశాలలు తెరిచారు.
 
దీపావళి అనంతరం వైద్యఆరోగ్యశాఖ జిల్లాలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 837 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించింది. వారిలో 80 మందికి కరోనా సోకినట్లు తేలింది.