శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (20:26 IST)

మౌత్‌వాష్‌ వల్ల 30 సెకన్లలో కరోనా వైరస్‌ పరార్.. యూకే శాస్త్రవేత్తలు

Mouthwash
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం లాంటి అంశాలు ముందు నుంచి మన సమాజాల్లో కొనసాగుతున్నాయి. తాజాగా మౌత్‌వాష్‌ వల్ల కరోనా వైరస్‌ 30 సెకన్లలోనే అంతమవుతుందని యూకేలోని కార్డిఫ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన చెబుతోంది. 
 
ఈ పరిశోధనలో భాగంగా 0.07% సెటీపెరిడినమ్‌ క్లోరైడ్‌ రసాయనం కలిగి ఉన్న ఏ మౌత్‌వాష్‌ అయినా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ప్రయోగశాలలో చేసిన పరిశోధనలో వెల్లడైంది. డెంటిల్‌ అనే బ్రాండ్‌ మౌత్‌వాష్‌ను ఉపయోగించి కార్డిఫ్‌ యూనివర్సిటీలోని ప్రయోగశాలల్లో పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు పై విషయాన్ని వెల్లడించారు.
 
ఇక ల్యాబ్‌లో చేసిన పరిశోధనల్లో మౌత్‌వాష్‌ వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంది. ఇక డ్రాగన్ కంట్రీ నుంచి ప్రపంచానికి పరిచయమైన కరోనా వైరస్‌ మౌత్ వాష్ వల్ల పారిపోతుందని.. కరోనా బాధితులపై అధ్యయనం చేసినపుడు ఏ విధంగా ఫలితం వస్తుందో చూడాల్సి ఉందని ఫ్రొఫెసర్‌ థామస్‌ అన్నారు.