శనివారం, 9 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (13:24 IST)

ఈజిప్టు స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్‌కు కోవిడ్..

కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా వైరస్ వదిలిపెట్టట్లేదు. అయితే లాక్‌డౌన్‌ను ప్రపంచ వ్యాప్తంగా తొలగించడంతో అన్ని దేశాలు క్రీడలను తిరిగి మొదలు పెట్టాయి. అప్పటినుంచి రోజుకో ఆటగాడు కరోనా బారిన పడుతున్నారు. అయితే ఇటీవల ఈజిప్టు స్టార్ ఫుట్ బాలర్ కరోనా బారినపడ్డాడు. దాంతో ఆ జట్టు నిరాశకు గురైంది. 
 
ఈజిప్ట్ జట్టుకు మిడ్ ఫీల్డర్‌గా క్రేజ్‌ను తెచ్చుకున్న మహమ్మద్ ఎల్నెని కరోనాతో పోరాడుతున్నాడు. అతడు లేకపోవడం జట్టుకు లోటవ్వనుందని క్రీడా పండితులు భావిస్తున్నారు. అయితే ఎల్నెనికి ఎటువంటి లక్షణాలు లేవని, అతి స్వల్పంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. అయితే రానున్నా మ్యాచ్ నిమిత్తం మరోసారి పరీక్ష చేయించగా అతడికి నెగిటివ్‌గా ఫలితాలు వచ్చాయి. అయినప్పటికీ తన వైద్యాన్ని పూర్తిచేయాలని వైద్యులు సలహా ఇచ్చారు.