Daily Horoscope
✕

కరోనా వైరస్.. చైనాలో తగ్గుతుంటే.. భారత్‌లో పెరుగుతున్నాయ్... (Video)

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 6 మార్చి 2020 (18:34 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇపుడు భారత్‌లో విజృంభిస్తోంది. ముఖ్యంగా, ఈ వైరస్‌కు కేంద్రంగా ఉన్న చైనాలోని వూహాన్ నగరంలో ప్రస్తుతం పరిస్థితి కుదుటపడుతోంది. అలాగే, చైనాలో కూడా నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువగా ఉంది. కానీ, భారత్‌లో మాత్రం ఈ కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారంతో భారత్‌లో మొత్తం 31 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో ముగ్గురు కేరళ వాసులు మాత్రం చికిత్స పూర్తిచేసుకుని సురక్షితంగా ఇంటికి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రకటించారు. 
 
అలాగే, భారత్‌లో ఐదు రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. తొలి కేసు తెలంగాణాలో నమోదైంది. ఆ తర్వాత ఢిల్లీ రెండు కేసులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏడు, రాజస్థాన్ రాష్ట్రంలో 17, కేరళలో మూడు కేసులు చొప్పున నమోదు కాగా, శుక్రవారం ఢిల్లీలో మరో కేసు నమోదైంది. దీంతో ఢిల్లీలో మొత్తం 3 కేసులు నమోదైనట్టయింది. 
 
కాగా, ప్రపంచ వ్యాప్తంగా 94,900 మందికి ఈ వైరస్ సోకగా, 3,272 మంది మృతి చెందారు. చైనాను మినహాయిస్తే 79 విదేశాల్లో 14,500 కేసులు నమోదు కాదు, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాల్లో రికార్డు స్థాయిలో 272 కేసులు నమోదయ్యాయి.

ఒక్క చైనాలోనే 80,400 మందికి ఈ వైరస్ సోకగా, మూడు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్-19 కారణంగా హుబెయ్ ప్రొవిన్స్‌లో డిసెంబరు నెలలో తొలి మరణం సంభవించింది. 
 

అన్నీ చూడండి

Dhanush: ఆరోగ్యం సహకరించలేదు : మమ్ముట్టి - ఓం లో పాత్రలు తెలుగులోనే మాట్లాడతాయి : ధనుష్

Rocking Star Yash: రామాయణం తో రాకింగ్ స్టార్ యశ్ కు బిగ్ ఆఫర్ ?

ఆ ఛాన్స్ దైవిక నిర్ణయం - అసలైన స్థాయి ఏంటో అపుడు తెలిసింది : రేణూదేశాయ్ (Video)

స్వామీజీని వివాహమాడిన వరుణ్ తేజ్ హీరోయిన్

అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రాజిగాడు రాజయ్యాడు సిద్ధం

తర్వాతి కథనం
Show comments