మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (15:24 IST)

కరోనా రోగి చివరి కోరిక.. తీర్చిన వైద్యుడు.. ఏంటదో తెలుసా?

coronavirus
చైనాలో కరోనా సోకిన రోగి గత నెల రోజుల నుంచి ఆస్పత్రిలోనే వుంటున్నాడు. ఈ క్రమంలో అతనికి అందమైన సూర్యాస్తమం చూడాలనే కోరికను తనకు వైద్యం చేస్తున్న డాక్టర్‌కు వెల్లడించాడు. తాను ఎంతకాలం బతుకుతానో తెలియదు. అందుకే తనకు సూర్యాస్తమయం చూడాలనే కోరిక వుందని అడిగాడు. ఆ వృద్ధుడి కోరిక విన్న ఆ డాక్టర్ కూడా చలించిపోయాడు. 
 
కానీ కరోనా సోకినవారిని టెస్ట్ లకు తప్పించి రూమ్ నుంచి బైటకు తీసుకెళ్లకూడదు. కానీ ఆ వృద్ధుడి కోరికను తీర్చాలనుకున్నాడు ఆ డాక్టర్. దీంతో సూర్యాస్తమయం సమయంలో సిటీ స్కాన్ చేయటానికి తీసుకెళుతూ..మధ్యలో సూర్యాస్తమయం కనిపించే స్థలానికి తీసుకెళ్లి చూపించాడు. 
 
అది చూసిన ఆ వృద్ధుడి ఆనందానికి అవధుల్లేవుయ. అతని కళ్లలోని ఆనందాన్ని చూసిన ఆ డాక్టర్ సంతోషించాడు. ఇద్దరూ కలిసి సూర్యాస్తమయాన్ని చక్కగా ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది.