శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (18:51 IST)

ఏపీలో రోజూ వెయ్యి కేసులు.. 24 గంటల్లో 11,840 కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ సుమారు వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. ఇక, గురువారం కరోనా పాజిటివ్ కేసులు ఏకంగా వెయ్యి దాటేశాయి. గత 24 గంటల్లో 30వేల 964 శాంపిల్స్‌ను పరీక్షించగా 11,840 మందికి వైరస్‌ సోకినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. 
 
మరోవైపు యాక్టివ్ కేసులు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు వెయ్యి రెండు వేలు మాత్రమే ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పుడు ఏకంగా 7వేలు దాటేశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7వేల 338 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
 
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 352 కేసులు నమోదు కాగా అనంతపురంలో 66 తూర్పుగోదావరిలో 26 చిత్తూరులో 115 కడపలో 62 కృష్ణాలో 113 కర్నూలులో 64 నెల్లూరులో 78 ప్రకాశంలో 45 శ్రీకాకుళంలో 47 విశాఖలో 186 విజయనగరంలో 19 పశ్చిమగోదావరిలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
ఇక, కోవిడ్ బారినపడి గత 24గంటల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో, ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7వేల 217కి చేరింది.