Daily Horoscope
✕

ఎవరికైనా ఫోన్ చేస్తున్నారా? కరోనా కాల్ పలకరిస్తుంది..

Written By సెల్వి
Updated: శనివారం, 7 మార్చి 2020 (15:19 IST)
కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో.. ప్రభుత్వాలు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నప్పటికీ ఇంకా కొంతమంది సరైన జాగ్రత్తలు పాటించడంలేదు. ఈ కారణంతోనే ప్రస్తుతం మొబైల్ సర్వీస్ ఆపరేటర్లు కూడా ఈ ప్రయత్నంలో భాగం అయినట్లుగా తెలుస్తోంది. మొబైల్ ఫోనులో ఏ కాల్ వచ్చినా వారిని ముందుగా కరోనా కాల్ పలకరిస్తుంది. 
 
కాల్ చేయగానే మొదటి ఒక పొడి దగ్గు... వినిపిస్తుంది. అదేంటి మనం కాల్ చేసిన తర్వాత కనీసం రింగ్ కూడా కాలేదు అప్పుడే కాల్ లిఫ్ట్ చేశాడా అని అనిపిస్తుంది. అయితే ఆ దగ్గు మళ్లీ వెంటనే తగ్గిపోతుంది.. ఆ తర్వాత కరోనా వైరస్ గురించిన హెచ్చరికలు మొదలవుతాయి. కరోనా వైరస్ ఎలా ప్రబలుతోంది కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దగ్గు లేదా తుమ్ము తరచూ వస్తున్న వ్యక్తుల నుంచి కాస్త దూరంగా ఉండటం మేలు అనే సందేశం ఇస్తుంది. 
 
అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని ఇలా కరోనా గురించి కొన్ని సలహాలు వస్తాయి. దీనిని బట్టి మనం ఎవరికీ కాల్ చేసినా కూడా మనకి ముందుగా కరోనా హెచ్చరికలు వినిపిస్తాయి.

అన్నీ చూడండి

అనిరుధ్, కావ్యమారన్ వివాహ ఆహ్వాన పత్రిక.. సోషల్ మీడియాలో వైరల్

Netflix Megaverse: నెట్‌ఫ్లిక్స్ టాక్ షో మెగావర్స్ ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి

Sri Vishnu: సమ్మర్ హాలిడేస్..ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది : హీరో శ్రీవిష్ణు

Harish Shankar: రుద్రవనం పీఎస్.. కంటెంట్ చూశా, హిట్ అవుతుందనే నమ్మకం వుంది : హరీష్ శంకర్

Anil Ravipudi :డెస్టినీ లో ఇద్దరి గుండెలపైన సాంగ్ బాగుంది : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments