suvichar

ఏపీలో కొత్తగా 1831 కరోనా పాటిటివ్ కేసులు - రాత్రి కర్ఫ్యూ

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 11 జనవరి 2022 (18:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా విస్తరిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా వంద శాతం కేసులు పెరిగాయి. తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం 1831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు కావడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. సోమవారం ఈ కేసుల సంఖ్య 984గా ఉన్న విషయం తెల్సిందే. ఇపుడు ఈ కేసులు ఒక్కసారిగా 1831కు చేరాయి. 
 
ఈ నెలాఖరు వరకు రాత్రిపూట కర్ఫ్యూ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వం అనేక కఠిన ఆంక్షలు విధిస్తుంది. ఇందులోభాగంగా, ఈ నెల 31వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. అలాగే, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాల ప్రదర్శనకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అంటే ఒక సీటు విడిచి మరో సీటులో కూర్చొని సినిమా తిలకించేలా షరతులు విధించింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో పాటు.. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ నెల 31వ తేదీ వరకు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. 
 
అయితే, రాత్రిపూట కర్ఫ్యూ నుంమచి ఆస్పత్రులు, ఫార్మసీ దుకాళాలు, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ బంకులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, వైద్య సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. 

అన్నీ చూడండి

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

Rashmika Mandanna : ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రశ్మిక మందన్న- అల్లు అరవింద్ ప్రకటన

Ramyakrishna :ఒక్క చూపు... ఆ ఫ్రేమ్ అంతా ఆమెదే.. అంటూ మంచు మనోజ్ ప్రశంస

Samantha Ruth Prabhu: శ్రీచక్ర యంత్రంతో సమంత సీమంతం Photos

Dr. Rajendra Prasad: అందరి కథ. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులూ కన్నీరు పెట్టుకున్నారు : డా. రాజేంద్రప్రసాద్

తర్వాతి కథనం
Show comments