Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్‌లో 31 మంది ఖాకీలకు కరోనా పాజిటివ్

Written By ఠాగూర్
Updated: గురువారం, 7 మే 2020 (17:37 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో కరోనా వైరస్ జోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ వైరస్ దెబ్బకు ఇప్పటికే ఇండోర్ పట్టణం అతలాకుతలమైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా 31 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది.
 
ఈ విషయాన్ని ఇండోర్‌ (ఈస్ట్‌) ఎస్పీ మహ్మద్‌ యూసఫ్‌ ఖురేషీ తెలిపారు. వారిలో 22 మంది వేర్వేరు ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారని, మరో ఎనిమిది మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. 
 
మరోవైపు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3049 కరోనా కేసులు నమోదు కాగా 176 మంది చనిపోయారు. ఇకపోతే, దేశంలో మొత్తం 52952 మందికి ఈ వైరస్ సోకింది. 1783 మంది చనిపోగా, 15267 మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. 

అన్నీ చూడండి

మంగళసూత్ర మహిళలే ఎందుకు ధరించాలి... పురుషులకు లేని నిబంధనలు స్త్రీలకే ఎందుకు? నటి నమిత ప్రశ్న

Keerthy Suresh: డోరతీ ప్రీమియర్ లో కీర్తి సురేష్‌కు ఘనస్వాగతం పలికిన టొరంటో

Samyuktha: పూరిజగన్నాధ్, రామ్ పోతినేని చిత్రాల్లో నటిస్తూ పుట్టినరోజు చేసుకున్న సంయుక్త మీనన్

Naga Chaitanya: ఫౌజీ తో తలపడుతున్న నాగ చైతన్య వృషకర్మ చిత్రం

Mahendragiri Varahi Review: ఆకట్టుకోని సుమంత్ చిత్రం మహేంద్రగిరి వారాహి రివ్యూ

తర్వాతి కథనం
Show comments