తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ముగ్గురు మృతి

మంగళవారం, 8 డిశెంబరు 2020 (11:44 IST)
తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో కొత్తగా 682 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. మరో 812 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (డిసెంబర్ 8) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.
 
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,74,540కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1477కి చేరింది. ప్రస్తుతం 7,696 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 5634 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 761 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,65,317కి చేరింది.
 
గడిచిన 24గంటల్లో మొత్తం 45,021 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 58,68,233కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,57,663 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 94.6శాతం ఉండగా తెలంగాణలో 96.65శాతం ఉన్నట్లు తెలిపారు.

అన్నీ చూడండి

Chiranjeevi: చిరంజీవి గారి సలహా స్పూర్తి,. బుచ్చిబాబు వల్ల చేతికి గాయం : రామ్ చరణ్

Sudheer Anand: సుడిగాలి సుధీర్ ఇకపై సుధీర్ ఆనంద్ గా హై లెస్సో చిత్రంతో రాబోతున్నాడు

Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments