శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జులై 2020 (09:05 IST)

కరోనా కేసుల్లో మూడో స్థానానికి ఎగబాకిన భారత్

కరోనా కేసుల్లో భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఆ స్థానంలో రష్యా ఉండేది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదైన దేశాల్లో రష్యా మొత్తం 6.8 లక్షల కేసులతో మూడో స్థానంలో ఉండేది. అయితే, భారత్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఆదివారానికి భారత్‌లో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 6.9 లక్షలకు చేరింది. ఫలితంగా మూడో స్థానంలో నిలించింది. భారత్ కంటే ముందు స్థానాల్లో బ్రెజిల్ రెండో స్థానంలోనూ, అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో మొత్తం 28 లక్షల కేసులు నమోదైవుండగా, బ్రెజిల్‌లో 15 లక్షల కేసులు ఉన్నాయి. 
 
కాగా, గడచిన 24 గంటల వ్యవధిలో 25 వేలకు పైగా కేసులు, 613 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జనవరిలో తొలి కేసు నమోదైన తర్వాత, ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. 
 
ఇదేసమయంలో మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 19,268 మంది కరోనా కారణంగా మరణించారు. పశ్చిమ, దక్షిణ భారతావనిలో రుతుపవనాలు విస్తరించి, వర్షాలు కురుస్తూ ఉండటంతో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతాయని అంచనా.