Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కేసుల వివరాలు.. 24 గంటల్లో కొత్తగా 31,118 కోవిడ్ కేసులు

Written By సెల్వి
Updated: మంగళవారం, 1 డిశెంబరు 2020 (10:59 IST)
భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 31,118 కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపిన కరోనా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 31,118 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదేవిధంగా గడచిన 24గంటల్లో 482 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో మృతుల సంఖ్య 1,37,621కి పెరిగింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 94,62,810కి చేరింది. 
 
ఇక గత 24 గంటల్లో 41,985 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 88,89,585 మంది కోలుకున్నారు. 4,35,603 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. క్రియాశీల కేసుల సంఖ్య 4,35,603గా ఉంది.ఇక రికవరీ రేటు 93.94 శాతానికి చేరగా.. యాక్టీవ్‌ కేసుల సంఖ్య 4.60 శాతానికి తగ్గింది. మరణాల రేటు 1.45 శాతంగా నమోదైంది.
 
ఇక ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 381 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,68,064కి చేరింది. ఇందులో 7840 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,53,232 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
అటు సోమవారం వైరస్ కారణంగా 4 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,992కు చేరుకుంది. ఇక నిన్న 934 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,00,57,854 శాంపిల్స్‌ను పరీక్షించారు.

అన్నీ చూడండి

విశ్వక్ సేన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా లెగసీ విడుదల తేదీ ఖరారు

Sree Vishnu: మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు ఎందుకయ్యాడు..

Naga Vamsi : ఆదర్శ కుటుంబం చిత్రం విడుదలపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర స్టేట్ మెంట్

Karthi: సర్దార్ చూశాక వాటర్ బాటిల్ ప్లాంట్స్‌ని రానివ్వమని గట్టిగా అరిచారు : కార్తి

Rashmika Mandanna: ఆనంద్ సినిమా గురించే ఆలోచిస్తాడు, కష్టపడుతుంటాడు, ఎపిక్ చూస్తా : రష్మిక మందన్నా

తర్వాతి కథనం
Show comments