కరోనా జీవితకాలం 12 గంటలు కాదు.. ఆ నౌకలో 17 రోజులైనా?

మంగళవారం, 24 మార్చి 2020 (16:59 IST)
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ 12 గంటల కంటే ఎక్కువసేపు మనుగడ సాధంచలేదని కేంద్రం ప్రచారం చేసింది. కానీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది. షాకింగ్ న్యూస్ ఏంటంటే.. కరోనా వైరస్ 17 రోజుల పాటు బతికి ఉండడాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) పరిశోధకులు గుర్తించారు. 
 
చైనాలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలో ప్రముఖ పర్యాటక నౌక డైమండ్ ప్రిన్సెస్ జపాన్ లోని యోకహామా రేవులో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ నౌకలోని 700 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ ఫలితాలు రావడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
 
ఎట్టకేలకు డైమండ్ ప్రిన్సెస్ లోని ప్రయాణికులందరినీ తరలించారు. తరలింపు కార్యక్రమం జరిగి రెండు వారాలు గడిచింది. కానీ డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలోని క్యాబిన్లలో కరోనా వైరస్ ఉనికిని పరిశోధకులు కనుగొన్నారు. గత 17 రోజులుగా వైరస్ ఆ నౌకలో మనుగడ సాగిస్తుండడం ఆ మహమ్మారి మొండితనాన్ని సూచిస్తోందని పరిశోధకులు అంటున్నారు.
 
ఇదిలా ఉంటే.. అమెరికా దేశంలోని కాలిఫోర్నియా తీరంలోని సముద్రంలో ఉన్న గ్రాండ్ ప్రిన్సెస్ విహారనౌకలో 21 మందికి కరోనా వైరస్ సోకిందని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

గ్రాండ్ ప్రిన్సెస్ విహారనౌకలో మొత్తం 3,500 మంది సిబ్బంది, ప్రయాణికులుండగా వీరిలో తాజాగా 21 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో వచ్చిందని మైక్ పెన్స్ చెప్పారు.

ఈ విహార నౌకలో మొత్తం 46 మందికి కరోనా వైరస్ సోకడంతో ఈ నౌకను వాణిజ్యేతర ఓడరేవుకు తీసుకువచ్చి కరోనా బాధితులకు చికిత్స అందిస్తామని అమెరికా వైద్యవర్గాలు వెల్లడించాయి.

అన్నీ చూడండి

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments