ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (10:01 IST)

భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..

భారత్‌లో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే.. కేంద్ర ఆరోగ్య విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,850 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,36,308 కు చేరింది. 274 రోజుల తర్వాత ఇంత తక్కువగా యాక్టివ్‌ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.26 శాతంగా ఉంది.
 
ఇక దేశంలో తాజాగా 555 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 4,63,245కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 12,403 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 3,386,483కు చేరింది. 
 
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,11,40,48,134 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏకంగా 62.23 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.