Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కరోనా తగ్గుముఖం... దేశంలో మరో 18 వేల కేసులు

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 27 డిశెంబరు 2020 (13:12 IST)
తెలంగాణలో గత 24 గంటల్లో 472 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 509 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,863కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,76,753 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,531కి చేరింది. 
 
తెలంగాణలో ప్రస్తుతం 6,579 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో4,426 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 106 కరోనా కేసులు నమోదయ్యాయి.   
 
ఇకపోతే, దేశంలో గత 24 గంటల్లో 18,732 మందికి కరోనా వైరస్ సోకింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 21,430 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,87,850కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 279 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,47,622 కు పెరిగింది. దేశంలో కరోనా చికిత్సకు ఇప్పటివరకు 97,61,538 మంది కోలుకున్నారు. 2,78,690 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో శనివారం వరకు మొత్తం 16,81,02,657 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,43,368 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

అన్నీ చూడండి

దర్శకుడు సాయి రాజేష్ ఆవిష్కరించిన డియర్ హార్ట్ మోషన్ పోస్టర్

రూ.200 కోట్ల క్లబ్‌లో రవితేజ 'ఇరుముడి' చిత్రం

ఆది సాయికుమార్ క్లాప్ తో ప్రారంభమైన ఇ.ఎం.ఐ. చిత్రం

ఇరుముడి లాంటి విజయం దశాబ్దానికి ఒకసారి వస్తుంది : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

Sumanth Prabhas :మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ప్రభాస్‌లో కనిపించింది : సుమంత్ ప్రభాస్

తర్వాతి కథనం
Show comments