Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 122 మందికి కరోనా పాజిటివ్ - ఒమిక్రాన్ కేసులు నిల్

Written By ఠాగూర్
Updated: సోమవారం, 3 జనవరి 2022 (18:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15,568 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, 122 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఇందులో కృష్ణా జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 కేసులు చొప్పున నమోదయ్యాయి. విజయనగరం, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైపు, రాష్ట్రంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదేసమయంలో కరోనా నుంచి 103 మంది కోలుకున్నారు. అయితే, విశాఖలో మాత్రం ఓ కరోనా రోగి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,77,608 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 1,278 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

అన్నీ చూడండి

ప్రభాస్ చిత్రం పౌర్ణమిలోని తెలుగు పాటకు చైనీస్ నర్తకి నాట్యం ట్రెండింగ్ వీడియో

మమ్ముట్టి మూవీ ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి వీడియో గ్లింప్స్

Fauzi Update: పోస్ట్‌ప్రొడక్షన్‌తో ఫౌజీ స్పీడ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ?

Sumanth: పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది : సుమంత్

Anaswara Rajan look: కాకా చిత్రానికి అనస్వర రాజన్ హృదయం అని కితాబు

తర్వాతి కథనం
Show comments