బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (15:12 IST)

దేశంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్ గుర్తింపు!

coronavirus
నిన్నామొన్నటివరకు కరోనా వైరస్‌తో ప్రజలంతా వణికిపోయారు. ఇపుడు ఈ వైరస్ కొత్త రూపంలో విజృంభిస్తుంది. ఈ కొత్త వైరస్ మహారాష్ట్రలో శరవేగంగా వ్యాపిస్తుంది. దీంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటిదాకా వెలుగు చూసిన కరోనా వేరియంట్లలో ప్రమాదకర, వేగంగా వ్యాప్తి చెందేది ఎక్స్ఎక్స్ బీ (ఎక్ఎక్స‌బీ) రకమని నిపుణులు భావిస్తున్నారు. గతవారంలో ముంబై, థానే, పూణే, రాయ్‌గడ్‌లోని ఎక్కువ జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఈ వేరియంట్ వెలుగు చూసినట్టు నిపుణులు తెలిపారు. 
 
ఈ నెల 10-16 తేదీల మధ్య కేసుల సంఖ్య 17.7 శాతానికి పైగా పెరిగినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఎక్స్‌ఎక్స్‌బీ వేరియంట్ ఇప్పటిదాకా 17 దేశాలకు వ్యాపించింది. బీఏ 2.75, బీజే.1 సబ్-వేరియంట్‌ల కంటే దీని వృద్ధి ఎక్కువగా ఉందని నిపుణులు భావిస్తున్నారు.