శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (22:34 IST)

ఉదయాన్నే పాలు-గుడ్లు ఒకేసారి తీసుకోరాదా? ఎందుకని? (video)

half-boiled eggs
ఉదయాన్నే అల్పాహారం అనేది ముఖ్యమైన భోజనం. ఉదయం వేళ శరీరానికి ప్రోటీన్ అవసరం. అందుకే చాలామంది ఉదయం వేళ కోడిగుడ్లను కానీ లేదంటే పాలు కానీ తీసుకుంటుంటారు. అయితే, పాలతో కూడిన పచ్చి గుడ్లు శరీరానికి మంచిదా లేదా చెడ్డదా అని చాలామందికి డౌట్.
 
అల్పాహారం అనేది ఎక్కువ గంటలు నిద్రపోయిన తర్వాత శరీరాన్ని కిక్‌ స్టార్ట్ చేసే భోజనం. గుడ్లు, పాలు రెండూ అద్భుతమైన ఎంపికలే. అయితే ఈ ఎంపికల ద్వారా ప్రయోజనాలను పొందాలనుకుంటే అది సరైన రూపంలో కలిసి ఉండాలి.

 
గుడ్లు ఉడికించినవో, గిలకొట్టి కోడిగుడ్డు ఆమ్లెట్, వేయించిన లేదంటే సగం ఉడకబెట్టడం వంటి అనేక రూపాల్లో వినియోగిస్తారు. గుడ్లలో కోలిన్, అల్బుమిన్, ప్రోటీన్లు ఉంటాయి, ఇవి శరీరానికి అవసరమైనవి. చాలా మేలు చేస్తాయి. మరోవైపు, పాలను నేరుగా తీసుకోవచ్చు లేదా వినియోగానికి ముందు పాశ్చరైజ్ చేయవచ్చు. అయినప్పటికీ, గుడ్లు- పాలు వాటి పచ్చి రూపంలో చాలా ఎక్కువ ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. వీటిని తీసుకున్నప్పుడు శరీరం సరిగ్గా ప్రాసెస్ చేయలేదు. ఇది జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తుంది. కొవ్వు నిల్వను పెంచుతుంది. అందువల్ల ఒకేసారి పాలు, గుడ్లు తినకపోవడం మంచిదని నిపుణులు చెపుతున్నారు.