సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (18:07 IST)

నేలకేసి కొడితే.. కోడిగుడ్లు బంతిలా ఎగురుతున్నాయి..?

eggs
నిర్మల్ జిల్లాలో భైంసాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భైంసా పట్టణంలోని  ఓ అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లల కోసం పంపిణీ చేసిన కోడిగుడ్లు అందరికీ షాకిచ్చాయి. అంగన్‌వాడి సెంటర్‌లో పంపిణీ చేసిన కోడిగడ్లను ఉడకబెట్టి తినబోతే.. రబ్బరులా సాగుతున్నాయి. 
 
నేలకేసి కొడితే.. కోడిగుడ్లు బంతిలా ఎగురుతున్నాయి. వెంటనే ఇంట్లోని వున్న అంగన్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన మిగిలిన గుడ్లు చెక్ చేయగా, అవి కూడా లోపలంతా విచిత్రంగా జిగురులాంటి పదార్థం కనిపించింది. దీంతో బాధితులంతా వాపోయారు.