పోటీపడి డ్యాన్స్ చేసిన పాములు
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో రెండు పాములు పోటీపడి డ్యాన్స్ చేశాయి. జిల్లాలోని భైంసా మండలం సిద్దూర్ శివారులోని గుట్ట ప్రాంతంలో మంగళవారం రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకొని సయ్యాటలాడాయి.
ఈ స్నేక్స్ డ్యాన్స్‌ను అటుగా వెళ్తున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్ అయింది. ఆ సర్పాలను చూసి కొందరు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో విష సర్పాలు అధికంగా తిరుగుతుంటాయి.