గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 20 జులై 2021 (19:29 IST)

22 ఏళ్ల యువతి ప్రేమలో 18 ఏళ్ల యువకుడు, పెద్దలు వద్దన్నందుకు...

ఆమెకి 22 ఏళ్లు, అతడికి 18 ఏళ్లు. కానీ వయసుతో సంబంధం లేకుండా ప్రేమలో మునిగారు. ఐతే విషయం పెద్దలకు తెలియడంతో ససేమిరా అన్నారు. నాలుగేళ్ల పెద్దదైన యువతితో పెళ్లికి నో చెప్పడంతో ఇరువురూ కలిసి నల్లమల అడవికి వెళ్లి ఓ చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
 
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా లోని లింగాల మండలం లోని శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల సలేశ్వరం ఇంటర్ చదివి హైదరాబాదులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడికి అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల రాధతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం పెద్దలకి తెలియడంతో వారు అంగీకరించలేదు.
 
రాధకు మరో సంబంధాన్ని చూసి నిశ్చితార్థం చేసారు. కొద్దిరోజుల్లో పెళ్లి జరుగనుంది. ఈ విషయం తెలుసుకున్న సలేశ్వరం హైదరాబాదు నుంచి వచ్చి రాధను తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వారి కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా నల్లమల అడవిలో ఓ చెట్టుకి యువతీయువకుల శవాలు వేలాడుతున్నట్లు గొర్రెల కాపరులు గుర్తించారు. విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. పోలీసులు సమాచారం అందుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.