గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (19:07 IST)

నిండు కుండలా హిమాయత్ సాగర్ జలాశయం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఉన్న హిమాయత్‌సాగర్ జ‌లాశ‌యం నిండుకుండలా మారింది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, మంగళవారం సాయంత్రం అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేప‌థ్యంలో రెవెన్యూ అధికారుల‌ను జ‌ల‌మండ‌లి అప్ర‌మ‌త్తం చేసింది. 
 
హిమాయ‌త్ సాగ‌ర్ ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌ల‌కు అధికారులు ప‌లు సూచ‌న‌లు చేశారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం సాగ‌ర్ ఇన్‌ఫ్లో 2,500 క్యూసెక్కులుగా ఉంది. జ‌లాశ‌యం గరిష్ఠ నీటిమ‌ట్టం 1763.50 అడుగులు కాగా, ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 1762.80 అడుగులుగా ఉంది.