ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (23:23 IST)

కుర్ కురే ప్యాకెట్ ఇచ్చి కిడ్నాప్ చేయాలనుకుంటే?

చిన్నారులకే కాదు.. టీనేజ్ పిల్లలు సైతం లేస్, కుర్ కురేలంటే వదిలిపెట్టరు. తాజాగా ఆ కుర్ కురేల ప్యాకెట్టే ఓ పాప కిడ్నాప్‌కు కారణం అయ్యింది. బయటి వ్యక్తులు చాక్లెట్లు, బిస్కెట్లు.. ఇతరత్రా ఎలాంటి ఆహారం ఇచ్చినా తీసుకోకూడదని తల్లిదండ్రులు చెప్తున్నా.. పిల్లలు వాటిపై వున్న క్రేజ్‌తో కిడ్నాపర్ల చేతిలో మోసపోతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా వీరబల్లి మండలం శీతంపేటలో అంగన్వాడీ సెంటర్ లోని ఓ పాపకు కురుకురే ప్యాకెట్ ఇచ్చి అపహరణకు ప్రయత్నించారు. మహిళ వేషంలో ఒకరు, బాబా వేషంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అపహరణకు ప్రయత్నించారు.
 
దీనిని గమనించిన స్థానికులు మొత్తం ముగ్గురు ముఠా సభ్యులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పిల్లల అపహరణ సభ్యులా లేక భిక్షాటన చేసేవారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.