Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కులు ధరించడం వల్ల రోగనిరోధకశక్తి బలహీనపడుతుందా?

Written By ఠాగూర్
Updated: శనివారం, 19 జూన్ 2021 (13:09 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని వైద్య నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. దీంతో అనేక మంది ఇంట్లో నుంచి కాలుబయటపెడితే ముఖానికి మాస్క్ ధరిస్తున్నారు. అయితే, ఈ మాస్కులు ధరించడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి తగ్గుతుందని ఇంగ్లండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎస్‌జీపీ) నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. 
 
ముఖ్యంగా చిన్నారుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. ఈ మార్గదర్శకాలను పాటించడం వల్ల కోవిడ్ మాత్రమే కాకుండా ఫ్లూ వంటి ఇతర శ్వాస సంబంధిత సమస్యల నుంచి కూడా తప్పించుకోవడం సాధ్యమైందని తెలిపింది. 
 
ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ఏమిటంటే, మాస్క్ ధారణ, భౌతిక దూరం పాటించడానికి సంబంధించిన ఆంక్షలను ఉపసంహరించిన తర్వాత సాధారణ సూక్ష్మ జీవుల నుంచి తప్పించుకునే సామర్థ్యం బాలలకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 
 
దీనికి కారణం కోవిడ్-19 మార్గదర్శకాల అమలుకాలంలో బాలల్లో రోగ నిరోధక శక్తి బలహీనపడటమేనని చెప్తున్నారు. ఈ ఆంక్షల అమలు కాలంలో బాలలు మాస్క్‌లు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ సూక్ష్మ జీవుల నిరోధక సామర్థ్యాన్ని పెంచుకోలేకపోయినట్టు తేలిందని పేర్కొంది. 

అన్నీ చూడండి

'పెద్ది' చిత్రాన్ని రాం చరణ్ భుజాలపై మోశారు - కానీ, ఆ ఒక్కటీ లోటుంది : పరుచూరి గోపాలకృష్ణ

Paradise teaser: పారడైజన్ జాగా కోసం నాని రక్తపాతం స్రుష్టించిన టీజర్ వచ్చేసింది

Korean Kanakaraju Review : రొటీన్ ఫార్మెట్ అయినా థ్రిల్ కలిగించే కథగా కొరియన్ కనకరాజు - రివ్యూ

హుషారు పిట్టలు, బిగ్ స్క్రీన్ పైన తనను తను చూసుకుని చెంప పగలగొట్టుకున్న నటుడు, వీడియో వైరల్

వారి వల్లే 'చెన్నై లవ్ స్టోరీ రూ. 50 కోట్ల గ్రాసర్ గా నిలిచింది - సాయి రాజేష్

తర్వాతి కథనం
Show comments