మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 జూన్ 2021 (15:59 IST)

మధ్యప్రదేశ్‌లో గ్రీన్ ఫంగస్ కలకలం.. 34ఏళ్ల వ్యక్తిని ఇండోర్ నుంచి ముంబైకి..?

Green Fungus
కరోనా నుంచి కోలుకుంటున్న వారికి ఫంగస్ కాటు తప్పట్లేదు. ఇప్పటికే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్‌లు బయటపడుతున్నాయి. తాజాగా గ్రీన్ ఫంగస్ కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో 34 ఏళ్ల ఓ వ్యక్తిలో ఈ ఫంగస్‌ను గుర్తించారు. దీంతో ఆ పేషెంట్‌ని హుటాహుటిన ఇండోర్ నుంచి ముంబైకి ఎయిర్ అంబులెన్సులో తరలించారు. 
 
సైనస్, లంగ్స్, బ్లడ్ లో గ్రీన్ ఫంగస్ అభివృద్ధి చెందినట్టు బయటపడిందని వైద్యులు చెప్పారు. ఇండోర్‌లోని శ్రీ అరబిందో ఇస్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి డాక్టర్లు ఈ కేసుకు చికిత్స అందిస్తున్నారు. పేషెంట్‌ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైలోని హిందుజా ఆస్పత్రికి తరలించారు. 
 
గ్రీన్ ఫంగస్ పేషెంట్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నాడని.. అయితే, ఆ తర్వాత ముక్కు నుంచి రక్తం కారడం, జ్వరం వంటి వాటితో బాధపడ్డారని డాక్టర్ రవి తెలిపారు. అంతేకాదు.. ఆయన బరువు తగ్గి, చాలా బలహీనంగా మారారని చెప్పారు. గ్రీన్ ఫంగస్‌పై రీసెర్చ్ జరగాల్సి ఉందని... కరోనా నుంచి కోలుకున్న వారిపై ఈ ఫంగస్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.