శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (08:27 IST)

ఆస్పత్రిలో అత్యాచారానికి గురైన మీర్జాపూర్ యువతి మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో వైద్యుల చేతిలో సామూహిక అత్యాచారానికిగురైన బాధిత మీర్జాపూర్ యువతి చికిత్స పొందుతూ మరణించారు. ప్రయాగరాజ్ నగరంలోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రి వైద్యులు తనపై అత్యాచారం చేశారని బాధిత యువతి ఆరోపించారు. 
 
మే 29వ తేదీన తాను పేగు సమస్యతో ఎస్ఆర్ఎన్ ఆసుపత్రిలో చేరితే శస్త్రచికిత్స చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లి తనపై వైద్యులు లైంగికదాడికి తెగబడ్డారని తన సోదరుడికి చెప్పింది. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైద్యులు మంచివారు కాదని, తప్పు చేశారని, తనకు చికిత్స కూడా చేయలేదని బాధితురాలు కాగితంపై రాశారు. దీంతో స్థానిక పోలీసులు వచ్చి దర్యాప్తు చేశారు. 
 
అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని చెప్పి వెళ్లాక యువతి మరణించింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎస్ఆర్ఎన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 
 
యువతికి ఆపరేషన్ చేసిన సమయంలో ఇద్దరు మగ వైద్యులున్నారని, నలుగురు మహిళా సర్జన్లు, నర్సు ఉన్నారని అత్యాచారం జరిగిందనే విషయాన్ని ఎస్పీ సింగ్ కొట్టిపారేశారు. యువతి మానసికస్థితి బాగాలేకనే వైద్యులపై ఆరోపణలు చేసిందని పోలీసులంటున్నారు.