శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 మే 2021 (19:39 IST)

అన్నం పెడతానని ఆశచూపి అంబులెన్స్‌లో గ్యాంగ్ రేప్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ సామూహిక అత్యాచారం జరిగింది. అన్నం పెడతానని ఆశ కల్పించి అంబులెన్స్‌లో గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. ఈ దారుణానికి అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు.. అతని స్నేహితుడు పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భోపాల్‌లో లాక్‌డౌన్ కారణంగా అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారిలో ఓ 22 యేళ్ళ మహిళ కూడా అన్నం కోసం ఓ చెట్టుకింద ఎదురుచూడసాగింది. 
 
ఆ సమయంలో అటుగా వచ్చిన అంబులెన్స్ డ్రైవర్, అతని స్నేహితుడు ఆహారం ఇస్తామని ఆశచూపి ఆమెను అంబెలెన్సులోకి తీసుకెళ్లి ఘోరానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం జరిగిందని చెప్పారు. అత్యాచారానికి గురైన మహిళ వివాహిత అని చెప్పారు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్ చేశారని పోలీసు అధికారి సురేంద్ర పంచోలి తెలిపారు.
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్ 376డీ (గ్యాంగ్ రేప్)తో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని చెప్పారు. అంబులెన్స్ డ్రైవర్‌ని, అతని స్నేహితుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్‌ను రికార్డ్ చేశామని, ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు కూడా చేయించామని చెప్పారు.