శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి

మహిళ గర్భాశయంలో 106 కణితులు.. తొలిగించిన వైద్యులు

ఓ మహిళ గర్భాశయంలో నుంచి ఢిల్లీ వైద్యులు 106 కణితులు తొలగించారు. ఢిల్లీకి చెందిన ఓ మహిళ (29) తీవ్రమైన నొప్పి, రుతుస్రావంలో అధికంగా రక్తం పోవడంతో పాటు ఇతర సమస్యలను ఎదుర్కొంటుంది. హిమోగ్లోబిన్ లెవల్స్ కూడా తగ్గాయి. దీంతో ఆమె ఢిల్లీలోని బీఎల్‌కే మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఫిబ్రవరిలో చేరింది.
 
అనంతరం ఆమెకు అల్ట్రా సౌండ్ పరీక్షలు నిర్వహించగా, గర్భాశయంలో పెద్ద పెద్ద కణితులను గుర్తించారు. కణితులు ఉండటంతో ఆమె 8 నెలల గర్భిణిలా ఉంది. మొత్తానికి ఆమెను పరీక్షించిన వైద్యులు.. హిమోగ్లోబిన్ స్థాయిలను 12 mg/dl కు పెంచారు. 
 
ఆ తర్వాత నాలుగున్నర గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి 106 కణితులను తొలగించారు. పద్నాలుగు కణితులు మాత్రం 5 నుంచి 8 సెంటిమీటర్ల పొడవు ఉన్నాయి. ప్రస్తుతం బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.