బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

దేశంలో కొత్తగా మరో 16,906 పాజిటివ్ కేసులు - 45 మంది మృతి

covid test
దేశంలో కొత్తగా మరో 16906 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. దేశంలో కొత్తగా 16906 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 4,36,69,850కి చేరుకుంది.
 
అలాగే, 45 కొత్త మరణాలతో మరణాల సంఖ్య 5,25,519కి చేరుకుంది. యాక్టివ్ కోవిడ్ కేసులు 1,32,457కి పెరిగాయి. మొత్తం ఇన్‌ఫెక్షన్‌లలో ఇవి 0.30 శాతం కాగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.49 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, ఈ వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,30,11,874కి పెరిగింది, అయితే కేసు మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.
 
దేశంలో కొత్తగా నమోదైన మరణాల్లో 45 కొత్త మరణాలలో కేరళలో 17, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్ రాష్ట్రలో ఐదు, గుజరాత్ నుండి ఇద్దరు, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కకరు ఉన్నారు.