శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (13:27 IST)

అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌-నవంబర్ 15తో 800 కోట్ల మార్కు

population
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సోమవారం విడుదల చేసిన ఓ నివేదికలో ఐక్యరాజ్యసమితి కీలక విషయాలను వెల్లడించింది. 
 
భారతదేశం వచ్చే ఏడాదికల్లా చైనాను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందని ఐరాస అంచనా వేసింది. ఈ ఏడాది నవంబర్‌ 15తో ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కును దాటుతుందని తెలిపింది. 
 
"భారత దేశ ప్రస్తుత జనాభా 141.2 కోట్లు. చైనా జనాభా 142.6 కోట్లు. 2023లో భారతదేశం చైనాను అధిగమిస్తుంది. 2050కల్లా ఇండియా జనాభా 166.8 కోట్లకు చేరుతుంది. అదే సమయంలో చైనా జనాభా క్రమంగా తగ్గి 131.7 కోట్లకు పరిమితం అవుతుందని ఐరాస తెలిపింది.
 
అయితే, జనాభా విస్ఫోటం నుంచి భూగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు రానున్న ముప్పై ఏండ్లలో పెరిగే ప్రపంచ జనాభాలో సగానికి పైగా కేవలం ఎనిమిది దేశాల్లోనే (డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, ఈజిప్టు, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, టాంజానియా) ఉంటుందని తెలిపింది.