బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 12 జులై 2022 (23:02 IST)

75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలు: ప్రత్యేక పాడ్‌క్యాస్ట్ సిరీస్ ‘బాత్ సర్హాద్ పార్- సరిహద్దుల్లో సంభాషణలు’

Baat Sarhad Paar
BBC న్యూస్ హిందీ- BBC న్యూస్ ఉర్దూ సంయుక్తంగా రూపొందించిన ప్రత్యేక పోడ్‌కాస్ట్ సిరీస్ 'బాత్ సర్హద్ పర్: సరిహద్దు దాటి సంభాషణలు'. ఈ ఏడాది తమ డెబ్బై ఐదవ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్న రెండు దేశాల నుండి కళ, సంగీతంతో పాటు సాహిత్య ప్రపంచాలకు చెందిన ప్రముఖులను ఒకచోట చేర్చింది. దేశాలు పంచుకున్న సామాజిక, సాంస్కృతిక జ్ఞాపకాలు అలాగే వారసత్వం ఆధారంగా భారతదేశం- పాకిస్తాన్ మధ్య సంభాషణల స్ఫూర్తిని, లోతైన సంబంధాలను వెలికి తీసి జరుపుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన చొరవ.

 
ఈ పాడ్‌క్యాస్ట్ సిరీస్ ఈ శుక్రవారం (జులై 15) ప్రారంభించబడుతుంది. ప్రతి శుక్రవారం BBC న్యూస్ హిందీ, BBC న్యూస్ ఉర్దూ వెబ్‌సైట్‌లు, సంబంధిత YouTube ఛానెల్‌లలో, Gaana, JioSaavn, Spotify సహా అన్ని ప్రధాన పాడ్‌కాస్ట్ ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త ఎపిసోడ్ విడుదల చేయబడుతుంది. ఈ పాడ్‌క్యాస్ట్ సరిహద్దులో ఉన్న వ్యక్తుల మధ్య సాధారణంగా కనిపించే ప్రత్యేక కనెక్షన్, అభిమానాన్ని విశ్లేషిస్తుంది. ప్రత్యేకించి సినిమా, సంగీతం, సాహిత్యం విషయాలను అందిస్తుంది.

 
ప్రతి ఎపిసోడ్‌లో, హై ప్రొఫైల్ వ్యక్తులు భారతదేశం- పాకిస్తాన్‌లలో తాము చూసిన మార్పుల గురించి, వారి అనుభవాలను, సరిహద్దు ఆవల నుండి తమ ప్రత్యర్ధుల నుండి ఎలా ప్రేరణ పొందారనే విషయాలను పంచుకుంటారు. పాడ్‌క్యాస్ట్ సిరీస్ టోన్ హృదయాన్ని అలరించేదిగా, హాస్యభరితంగా ఉంటుంది. కొన్నిసార్లు మానసికంగా కదిలించడమే కాదు బాగా ఆలోచింపజేస్తుంది కూడా.

 
చింతన్ కల్రా, BBC అజిత్ సారథి స్వరపరిచిన టైటిల్ సాంగ్ 'బాత్ సర్హద్ పర్', గత కాలాన్ని స్ఫురింపజేస్తూ డిజిటల్ ప్రొడక్షన్‌తో నింపబడిన భారతీయ, పాకిస్తానీ జానపద వాయిద్యాల క్లాసిక్ సమ్మేళనం. హృదయాన్ని కదిలించే సాహిత్యాన్ని అనీష్ అహ్లువాలియా రాశారు. శరత్ చంద్ర శ్రీవాస్తవ వయోలిన్‌పై జగ్తీందర్ ఆలపించారు.

 
BBC న్యూస్ హెడ్ ఆఫ్ ఇండియా రూపా ఝా ఇలా అంటున్నారు, “భారతదేశం- పాకిస్తాన్‌ల 75వ స్వాతంత్ర్యం దినోత్సవాన్ని గుర్తుచేసుకోవడానికి సరిహద్దు అంతటా ఉన్న ప్రజలను ఒకచోట చేర్చి భాగస్వామ్య సాంస్కృతిక విశిష్టతను, పరస్పరం వ్యక్తిగత ప్రయాణాలను జరుపుకోవడం కంటే మెరుగైన మార్గం ఏముంటుంది. ఈ మనోహరమైన కథలను పాడ్‌కాస్ట్‌గా చెప్పడం మా ప్రేక్షకులకు అంతర్దృష్టి, సన్నిహిత అనుభవం... ఓహ్ వాటిని మేము పంచుకోకుండా ఆగలేము.

 
ఆసిఫ్ ఫరూఖీ, పాకిస్తాన్ ఎడిటర్, BBC న్యూస్ ఉర్దూ ఇలా అన్నారు. “ఈ సిరీస్‌లో పని చేయడం నాకు, BBC ఉర్దూలోని నా సహోద్యోగి నజీష్ జాఫర్‌కు ఒక మనోహరమైన అనుభవం. ఆయన థీమ్‌ల చుట్టూ ఎపిసోడ్‌లను క్యూరేట్ చేయడంలోనూ, వ్యక్తులను కనెక్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. భవిష్యత్తుతో 75 సంవత్సరాల చరిత్ర ఉంది. విభజనకు ఇరువైపులా ఉన్న యువతరాలు తమ గతంతో అనుసంధానించబడినట్లు భావిస్తారు. శాంతి- ఐక్యతతో కూడిన భవిష్యత్తును ఆశిస్తున్నారు.

 
ప్రతి ఎపిసోడ్ సారాంశం- ముఖ్యాంశాలు ఇలా వున్నాయి
ఎపిసోడ్ 1- సరిహద్దు దాటి సంగీతం: భారతదేశానికి చెందిన ప్రఖ్యాత గాయకులు సునిధి చౌహాన్, పాకిస్తాన్‌కు చెందిన జెబ్ బంగాష్ తమ అభిమానుల ప్రేమాభిమానాలను, వారి జ్ఞాపకాలలో సంగీతం ఎలా అంతర్భాగమైందో అనే విషయం గురించి మాట్లాడుతారు. వారి హృదయపూర్వక సంభాషణ ఒకరి పని పట్ల మరొకరు అపారమైన అభిమానాన్ని చూపుతుంది. 'హైవే' చిత్రం నుండి సునిధి పాటను తాను విన్న సమయాలను గుర్తుచేసుకున్నారు జెబ్ బంగాష్. తన జీవితంలో చీకటి దశలలో సునిధి పాటలు తనకు బలం, మద్దతునిచ్చాయని ఆమె చెప్పింది. ఇద్దరు గాయకులు తాము సరిహద్దుల నుండి వింటూ పెరిగిన సంగీతకారుల నుండి ప్రేరణ పొందారని, ఒకరి దేశానికి చెందిన సంగీత స్వరకర్తలతో కలిసి పనిచేసిన వారి అనుభవాలను కూడా గుర్తు చేసుకున్నారు. సునిధి, జెబ్ వారి స్వంత పాటలను కూడా పాడారు. అలాగే భారతీయ- పాకిస్తానీ గాయకుల క్లాసిక్ పాటలను కవర్ చేస్తారు.

 
ఎపిసోడ్ 2- వ్యంగ్యం- సినిమా వినోదం: నిష్ణాతుడైన భారతీయ రచయిత, గేయ రచయిత, స్టాండ్-అప్ హాస్యనటుడు వరుణ్ గ్రోవర్- ప్రముఖ పాకిస్థానీ దర్శకుడు, నిర్మాత మరియు అనేక ప్రముఖ టెలివిజన్ డ్రామా సిరీస్‌లకు దర్శకత్వం వహించిన నటుడు సర్మద్ ఖూసత్‌తో పదునైన సంభాషణలో నిమగ్నమయ్యారు. ఆయన చిత్రం 'జిందగీ తమాషా' 2021లో ఆస్కార్‌లో విదేశీ చిత్ర విభాగంలోకి పాకిస్తాన్ నుంచి ప్రవేశాన్ని చేసింది. అయితే రాజకీయ వివాదాల కారణంగా విడుదల ఒక సంవత్సరానికి పైగా ఆలస్యం అయింది. వరుణ్- సర్మద్ రెండు దేశాలలో ఒకే రకమైన హాస్యం గురించి మాట్లాడుకున్నారు. కామెడీని సరైన స్ఫూర్తితో తీసుకోకపోతే వ్యంగ్యవాదులు ఎదుర్కొనే సవాళ్లు, ప్రతిఘటనల గురించి వారు పదునైన పరిశీలనలు కూడా చేస్తారు.

 
ఎపిసోడ్ 3- కవిత్వం, స్త్రీవాద ఆలోచనల పరిణామం: ప్రశంసలు పొందిన స్త్రీవాద కవులు, భారతదేశం నుండి అనామిక- పాకిస్తాన్ నుండి కిశ్వర్ నహీద్ ఉన్నారు. ఇద్దరూ తమ దేశంలోని ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారాలతో సత్కరించారు. అనామిక భారతదేశ సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్న మొదటి మహిళా కవయిత్రి. ఉర్దూ సాహిత్యానికి ఆమె చేసిన కృషికి కిశ్వర్ పాకిస్తాన్‌లో సితార్-ఎ-ఇమ్తియాజ్‌ను అందుకున్నారు. దేశాలు పంచుకున్న గొప్ప సాహిత్య వారసత్వాన్ని స్మరించుకుంటూ, సాహితీవేత్తలిద్దరూ ప్రేక్షకులను స్మృతి పథంలోకి తీసుకువెళ్లారు. వారు తమ ప్రసిద్ధ పద్యాలను కూడా పఠిస్తారు.

 
ఎపిసోడ్ 4- భారతదేశం- పాకిస్తాన్ విభజన: భారతీయ చరిత్రకారుడు, పరిశోధకుడు, రచయిత ఆంచల్ మల్హోత్రా- పాకిస్తానీ ఫ్యాషన్ జర్నలిస్ట్, సామాజిక వ్యాఖ్యాత, టెలివిజన్ పర్సనాలిటీ మొహ్సిన్ సయీద్‌తో సంభాషణలో ఉన్నారు. విభజన కారణంగా వారి తల్లిదండ్రులు, తాతామామల వలసల అనుభవాలను అతిథులకు వివరిస్తారు. ఈ వలసలనేవి రెండు దేశాలకి ఇరువైపులా మిలియన్ల మంది ప్రజలను స్థానభ్రంశం చేసి వేరు చేసింది. వారు నష్టాన్ని మాత్రమే కాకుండా, వారి కుటుంబాన్ని తట్టుకుని నిలబడటంతో పాటు వారి జీవితాన్ని పునరుద్ధరించిన విశ్వాసంతో పునర్నిర్మించడానికి సహాయపడిన వ్యక్తుల సంకల్పం గురించి కూడా చర్చిస్తారు.

 
ఎపిసోడ్ 5- సరిహద్దు వివాహాలు: ప్రేమపై దృష్టి సారిస్తుంది, అసమానతలకు వ్యతిరేకంగా విజయం. ముగ్గురు యువకులు... పాకిస్తాన్‌కు చెందిన మలీహా ఖాన్‌ను వివాహం చేసుకున్న భారతదేశానికి చెందిన అర్మాన్ దేహ్ల్వి, భారతీయుడిని వివాహం చేసుకున్న పాకిస్తాన్‌కు చెందిన డిసైరీ ఫ్రాన్సిస్, సరిహద్దు దాటి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక- అధికార ఇబ్బందులను వెల్లడించారు. నిష్కపటమైన సంభాషణలో, వారు నాటకీయ వృత్తాంతాలను వివరిస్తారు. తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటారు.