సోమవారం, 2 అక్టోబరు 2023
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (15:25 IST)

94 ఏళ్ల బామ్మ బంగారం సాధించింది... 100 మీటర్ల రేసులో అదుర్స్

Bhagwani Devi Dagar
Bhagwani Devi Dagar
ప్రతిభకు వయసు అడ్డు కాదని భారత్కు చెందిన భగవానీదేవి దాగర్ నిరూపించింది. ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ ఫిన్లాండ్లోని టాంపేర్ సిటీలో జరుగుతోంది.
 
ఈ ఛాంపియన్ షిప్లో 100 మీటర్ల స్ప్రింగ్ ఈవెంట్లో హర్యానాకు చెందిన ఈ 94 ఏళ్ల బామ్మ భగవానీ దేవి బంగారు పతకం సాధించింది. సీనియర్ సిటిజన్ విభాగంలో పోటీపడిన ఆమె.. 100 మీటర్లను  24.74 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సాధించింది.
 
ఈ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకంతో పాటు భగవానీదేవి మరో రెండు కాంస్య పతకాలను ఖాతాలో వేసుకుంది. షాప్ పుట్ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి బ్రౌంజ్ మెడల్ను సాధించింది. 
 
అలాగే మరో ఈ వెంట్లో కాంస్య పతకాన్ని దక్కించుకుని టోర్నీలో మొత్తం మూడు పతకాలను సొంతం చేసుకుని ఔరా అనిపించింది. 
 
మూడు పతకాలను మెడలో ధరించి విజయ గర్వంతో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న బామ్మ ఫోటో ప్రస్తుతం వైరల్గా మారింది. కేంద్ర క్రీడా శాఖ భగవానీదేవిని అభినందిస్తూ.. ట్విట్టర్లో ఆమె ఫోటోను పోస్ట్ చేసింది.