సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (09:56 IST)

దేశంలో కొత్తగా 10 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో కొత్తగా మరో పది వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 10,725 మందికి ఈ వైరస్ సోకింది. అలాగే, 34 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, గడిచిన 24 గంటల్లో ఈ వైరస్ నుంచి 13084 మంది బాధితులు కోలుకున్నారు. కొత్త కేసులతో కలుపుకుంటే దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,43,78,920కి చేరింది. ఇందులో 4,37,57,385 మంది బాధితులు కోలుకున్నారు. 
 
మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 5,27,488 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 94,047 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 210.82 కోట్ల డోసులు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు.