శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (18:12 IST)

బీహార్‌లో పిడుగుపాటు.. ఒక్క రోజే 16 మంది మృతి

thunder
బీహార్‌లో భారీ వర్షాల కారణంగా మంగళవారం పిడుగుపాటుకు 16మంది ప్రాణాలు కోల్పోయారు. బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు పెద్దఎత్తున పిడుగులు పడ్డాయి. దీంతో ఒక్క రోజులోనే పిడుగుపాటుతో 16 మంది మరణించారని అధికారులు తెలిపారు. 
 
ఈ ఘటనతో జూన్ నెలలోనే పిడుగుపాటు వల్ల మొత్తం 36 మంది మృతిచెందారని వెల్లడించారు. మృతుల కుంటుంబాలకు సీఎం నితీష్‌ కుమార్‌ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ప్రకటించారు.
 
కాగా జూన్ 18,19 తేదీల్లో బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు 17మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా బీహార్ లో పిడుగు పాటుకి ఒక్క జూన్ నెలలోనే 36మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
అలాగే జూన్ 21న పూర్నియా, ఖాగారియా, సహార్సాల్లో పిడుగు పడి ముగ్గురు చనిపోయారు. అలా ఒక్క జూన్ నెలలోనే పిడుగుపాటుకు 36మంది ప్రాణాలుకోల్పోయారు.