శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (11:34 IST)

బీహార్‌లో పిడుగుల వర్షం - 17 మంది మృత్యువాత

deadbody
బీహార్ రాష్ట్రంలో పిడుగుల వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి 17 మంది మృత్యువాతపడ్డారు. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కురిసిన భారీ వర్షానికి భాగల్‌పూర్‌లో ఆరుగురు, వైశాలి జిల్లాలో ముగ్గురు ఖగారియాలో ఇద్దరు, బంకాలో ఇద్దరు, కతిహార్‌లో ఒకరు, నహర్సాలో ఒకరు, మాధేపురాలో ఒకరు, ముంగేర్‌లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ ఘటనలపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రతికూల వాతావరణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పిడుగులు పడేసమయంలో విపత్తుల శాఖ జారీ చేసిన సూచనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
మరోవైపు, నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో చురుకుగా కదులుతున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఉత్తర, మధ్య తీర్పు భారతం అంతటా రెండు మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.