గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (08:58 IST)

బీహార్‌లో దారుణం - కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారం

victim
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కదులుతున్న బస్సులో కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆపై ఆ బాలికను బస్సులోనే వదిలి డోర్ లాక్ చేసి వెళ్ళిపోయాడు. ఈ కేసులో డ్రైవర్, కండక్టర్, క్లీనర్‌తో పాటు మొత్త నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసులు కథనం మేరకు.. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి బస్టాండ్‌లో ఈ నెల 17వ తేదీన బాలిక బెట్టయ్య ప్రాంతానికి వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తుంది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన బస్సు డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలని అడగ్గా బెట్టయ్యకు వెళ్లాలని ఆ బాలిక చెప్పింది. 
 
తమ బస్సు అటే వెళుతుందని చెప్పడంతో డ్రైవర్ మాటలు నమ్మిన బాలిక బస్సు ఎక్కింది. కొంతదూరం వెళ్లిన తర్వాత మత్తు మందు కలిపిన శీతలపానీయం ఆ బాలికకు ఇచ్చారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తమ పని పూర్తయిన తర్వాత బస్సును రోడ్డు పక్కన ఆపి డోర్లు లాక్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ బాలికకు స్పృహలోకి వచ్చి అటుగా వెళుతున్న వారి సాయంతో బయటపడింది.
 
బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.