ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (12:44 IST)

పోలీస్ కస్టడీకి సామూహిక అత్యాచార కేసు నిందితుడు

arrest
హైదరాబాద్ నగరంలోనే కలకలం రేపిన సామూహిక అత్యాచార కేసు నిందితుడిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, బుధవారం పోలీసులు కీలక ఆధారాలను సంపాదించారు. 
 
దీంతో ఏ1 నిందితుడుగా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నిందితుడిని పోలీసులు గురువారం తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. 
 
మరోవైపు, ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నారు. వారిలో సాదుద్దీన్ ఒకరి. ఈ కామాంధుడు ఒక్కడే మేజర్. మిగిలిన వారంతా మైనర్లు. దీంతో మంగళవారం రాత్రి కోర్టు అనుమతితో జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు... మిగిలిన మైనర్ నిందితులను జ్యువైనల్ హోంకు తరలించారు. తాజాగా కోర్టు అనుమతితో సాదుద్దీన్‌ను పోలీసులు గురువారం తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు.