ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 జులై 2022 (16:31 IST)

కేవలం 48 గంటల్లోనే కరోనా మటాష్.. నాసల్ స్ప్రే వచ్చేసింది..

Nasal spray
కరోనా వైరస్‌ కేవలం 48 గంటల్లోనే అంతమయ్యే మెడిసిన్‌ అందుబాటులోకి రానుంది. ముంబైకి చెందిన ఓ కంపెనీ గొప్ప నాసల్ స్ప్రేని అభివృద్ధి చేసింది. 306 మంది వృద్ధులపై ఈ యాంటీ-కోవిడ్ స్ప్రే పరీక్షించబడింది. దీంతో ఊహించిన విధంగానే ఫలితం వచ్చింది. 
 
ఈ స్ప్రే చాలా ప్రయోజనకరంగా ఉందని నిరూపించబడింది. ముంబైకి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లెన్‌మార్క్ కెనడియన్ కంపెనీ సనోటైజ్ సహకారంతో ఈ నాసల్ స్ప్రేని సిద్ధం చేసింది. 
 
ఈ స్ప్రేని ముక్కులో వేసుకున్న తర్వాత, కరోనా రోగులపై వైరల్ లోడ్ 24 గంటల్లో 94 శాతం తగ్గింది. 48 గంటల్లో, కరోనా వైరస్ ప్రభావం 99 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. ఈ స్ప్రే మూడవ దశ నివేదిక ది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియా జర్నల్‌లో ప్రచురించబడింది.
 
ఈ నాసల్ స్ప్రేని ముంబైకి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లెన్‌మార్క్ పరిశోధించి పరీక్షించింది. ఈ విధంగా ముంబైకి చెందిన ఈ కంపెనీ దేశంలోనే మొట్టమొదటి యాంటీ-కరోనా నాసల్ స్ప్రేని అభివృద్ధి చేసి మంచి ఫలితాలను సాధించింది. 
 
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ స్ప్రే ప్రయోగించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. దీని తర్వాత ఈ స్ప్రే ఇప్పుడు ప్రారంభించబడింది. 
 
24 గంటల్లో 94 శాతం వైరస్, 48 గంటల్లో 99 శాతం వైరస్ క్లియర్ అయినట్లు సదరు కంపెనీ వెల్లడించింది. దేశంలో డెల్టా, ఓమిక్రాన్ కేసులు తెరపైకి వస్తున్నప్పుడు దీనిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అధిక ప్రమాదం ఉన్న రోగులలో 24 గంటల్లో వైరల్ లోడ్ గణనీయంగా తగ్గిందని పరిశోధకులు కనుగొన్నారు.
 
భారతదేశంలో 25 ml బాటిల్ ధర 850 రూపాయలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ స్ప్రే ఒక వారంలో అమ్మకానికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.