ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 జులై 2022 (20:41 IST)

సోనూసూద్ ఫ్యామిలీ ఫోటోస్ వైరల్..

Sonu Sood
Sonu Sood
రియల్ హీరో సోనూసూద్ ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య 'ఆచార్య' అనే సినిమా రిలీజ్ అయితే.. మెగాస్టార్ చిరంజీవిని కూడా పక్కన పెట్టి ఓ థియేటర్ వద్ద సోనూసూద్‌కు పాలాభిషేకాలు చేయడం ఎంత హాట్ టాపిక్ అయ్యిందో తెలిసిందే.

దీనిని బట్టి సోనూసూద్‌ను జనాలు చాలా పర్సనల్‌గా తీసుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. 
 
ఇదిలా ఉండగా.. సోనూ సూద్ ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ టూర్ వేశాడు. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు తెలియజేశాడు. 
 
తన భార్య పిల్లలతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఈ ఫోటోల్లో సోనూసూద్ భార్య సూద్‌ను అలాగే అతని కొడుకులు ఇషాంత్ సూద్, అయాన్ సూద్‌‌లను కూడా చూడొచ్చు.