ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (17:20 IST)

విద్యుత్ షాక్‌: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

power tower
విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతులను బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన హైమద్ ఆయన భార్య పర్వీన్ పిల్లలు అద్నాన్, మాహిమ్‌గా గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళితే.. బీడీ వర్కర్స్ కాలనీలో హైమద్ (35) కుటుంబం నివసిస్తోంది. ఇటీవల ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఇళ్లంతా తడిగా మారింది.
 
ఈ క్రమంలోనే పిల్లలు కరెంట్ షాక్‌కు గురయ్యారని.. వారిని కాపాడే క్రమంలో తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.