తంజావూరు రథోత్సవంపై దర్యాప్తు ప్రారంభం.. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా
తమిళనాడు రాష్ట్రంలో ఘోరం జరిగింది. తంజావూరు నగరంలో జరిగిన ఓ ఆలయ రథోత్సవంలో అపశృతి చోటుచేసుకోవడంతో 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ జిల్లాలోని కలియమేడు అప్పర్ ఆలయ రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్ తగిలి 11 మంది సజీవదహనమయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అప్పర్ గురపూజై (అయ్యప్ప స్వామి పండుగ)ను పురస్కరించుని ప్రతి యేటా ఇక్కడ రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు రథాన్ని వీధుల గుండా లాగుతుండగా, ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ తీగలకు రథం తగలడంతో ఈ ఘోరం జరిగింది.
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇకపోతే.. తంజావూర్ రథోత్సవ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు తలా రెండు లక్షల రూపాయలను నష్టపరిహారంగా డీఎంకే పార్టీ ప్రకటించింది. గాయపడిన 14 మందికి రూ.25వేలను అందించనున్నట్లు తెలిపింది.