బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (11:19 IST)

పెరుగుతున్న కరోనా మరణాలు - తగ్గుతున్న పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ... ఈ వైరస్ బారినపడి మృతి చెందే వారి సంఖ్య పెరుగుతుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటన మేరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,346 కేసులు నమోదయ్యాయి. 
 
ఇదేసమయంలో కరోనా మరణాలు పెరుగుతుండటం కొంత ఆందోళన కలుగుతోంది. గత 24 గంటల్లో 263 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఈ మరణాల్లో సగానికి పైగా కేరళలో నమోదయ్యాయి. కేరళలో కొత్తగా 8,850 కేసులు నమోదు కాగా... 149 మంది మరణించారు.
 
అయితే, కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిందే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.