సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: గురువారం, 9 జులై 2020 (11:20 IST)

దేశంలో 24 గంటల్లో కొత్తగా 24,879 కరోనావైరస్ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ప్రస్తుతం భారత్‌లో తన ఉగ్రరూపాన్ని దాల్చింది. దీనికి తోడుగా భారత్‌లో కొత్తగా మరో24,879 కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి రోజురోజుకి పెరిగిపోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూ ఉన్నాయి.
 
గడిచిన 24 గంటల్లో 24,879 కేసులు నమోదు కాగా 487 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం దేశంలో మొత్తం 7,67,296 కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 2,69,789 ఉండగా 4,76,377 మంది చికిత్సలో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉండగా 21,129 మంది కరోనా వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,67,061 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 1,07,40,832 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.