Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 19న కరోనా వైరస్ పాజటివ్ బులిటెన్ - కొత్తగా 60,753 కేసులు

Written By ఠాగూర్
Updated: శనివారం, 19 జూన్ 2021 (10:52 IST)
దేశంలో గత 24 గంటల్లో 60,753 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... శుక్రవారం 97,743 మంది కోలుకున్నారు. 
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,23,546కు చేరింది. మరో 1,647 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,85,137కు పెరిగింది.
 
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,86,78,390 మంది కోలుకున్నారు. 7,60,019 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇక వ్యాక్సినేష్‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 27,23,88,783 డోసులు ఇవ్వడం జరిగింది. 
 
కాగా, దేశంలో శుక్రవారం వరకు మొత్తం 38,92,07,637 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. శుక్రవారం 19,02,009 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత క్రమంగా నియంత్రణలోకి వస్తుంది. గడచిన 24 గంటల్లో 1,24,430 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,417 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 149, రంగారెడ్డి జిల్లాలో 104, ఖమ్మం జిల్లాలో 93 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో రెండు కేసులు గుర్తించారు.
 
అదేసమయంలో 1,897 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం 3,546 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,10,834 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,88,259 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,029 చికిత్స పొందుతున్నారు.

అన్నీ చూడండి

బాలీవుడ్ హీరోహీరోయిన్ల మధ్య వయసు అంతరం : మనీషా కోయిరాలా

మూడోసారి గర్భమా? అది ప్రెగ్నెన్సీ కాదు.. పిజ్జా తినడం వల్లే...

ఇకపై కేవలం బ్లాక్‌బస్టర్ చిత్రాలే తీస్తా : నిర్మాత బండ్ల గణేశ్

Raviteja: ఇరుముడి విజయంతో సంతోషంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో రవితేజ

బంద‌ర్‌ స్ట్రీమింగ్‌.. వైవిధ్య‌మైన పాత్ర‌లో మెప్పించిన బాబీ డియోల్‌

తర్వాతి కథనం
Show comments