Festival Posters
✕

వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా లంబ్డా.. పెరూలో సరికొత్త వైరస్

Written By ఠాగూర్
Updated: శనివారం, 19 జూన్ 2021 (08:46 IST)
ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో ప్రపంచదేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో చేదు వార్తను తెలియజేసింది. తాజాగా మరో కొత్త వేరియంట్‌ను 29 దేశాల్లో గుర్తించినట్లు వెల్లడించింది. 
 
పెరూలో తొలుత గుర్తించిన ఈ రకానికి లాంబ్డాగా నామకరణం చేశారు. ప్రస్తుతానికి దీన్ని అధ్యయనాసక్తి గల వేరియంట్‌ (వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌)గా గుర్తించారు. దీనివల్ల ఎంత మేర ప్రమాదం పొంచి ఉందన్న దానిపై అధ్యయనం జరగాల్సి ఉంది.
 
తొలుత ఈ వేరియంట్‌ను ఆగస్టు 2020లో పెరూలో గుర్తించారు. ఇప్పటివరకు 29 దేశాలకు ఇది వ్యాపించింది. ముఖ్యంగా అర్జెంటీనా, చిలీ వంటి లాటిన్‌ అమెరికా దేశాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. ఏప్రిల్‌ నాటికి పెరూలో వెలుగులోకి వచ్చిన మొత్తం కేసుల్లో 81 శాతం లాంబ్డా వేరియంట్‌కు సంబధించినవే కావడం గమనార్హం. 
 
ఇక చిలీలో జన్యుక్రమ విశ్లేషణ జరిపిన నమూనాల్లో 61 శాతం వాటిల్లో కొత్త వేరియంట్‌ ఆనవాళ్లను గుర్తించారు. దీని వ్యాప్తి కొన్ని దేశాల్లో ఆందోళనకర స్థాయిలోనే ఉందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. పెరూ, చిలీ, ఈక్వెడార్‌, అర్జెంటినాలో వైరస్‌ ప్రభావం అధికంగా ఉందని తెలిపింది. 

అన్నీ చూడండి

రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్‌సీ-17

విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ ట్రైలర్ రాబోతోంది

నువ్వు విలన్ వి ? చనిపోతావా? ఓడిపోతావా? అని నిలదీశిన యశ్ కుమారుడు

Rudravanam PS Series Review: రుద్రవనం పీఎస్ లో మర్డర్ల రహస్యం ఏమిటి? వెబ్ సిరీస్ రివ్యూ

Prakash Raj, ఇచ్చిన సినీ అడ్వాన్సులు వెనక్కి తీస్కుంటున్నారు: ప్రకాష్ రాజ్ భార్య పోనీ

తర్వాతి కథనం
Show comments