శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (11:19 IST)

పొగరాయుళ్ళకు కరోనా వైరస్‌తో పెనుముప్పు?

పొగరాయుళ్ళకు కరోనా వైరస్‌తో పెను ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. సాధారణ వ్యక్తుల కంటే.. పొగ సేవించే వారికి ఈ వైరస్ సులంభంగా సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా, ధూమ‌పానం చేసేవాళ్ల చేతివేళ్లు.. ఎప్పుడూ పెద‌వుల‌ను తాకే అవ‌కాశాలు ఉంటాయి. దాని వ‌ల్ల చేతిలో ఉన్న వైర‌స్‌.. పెద‌వుల ద్వారా శ‌రీరంలోకి వెళ్లే ఛాన్సు ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 
 
ఒక‌వేళ సిగ‌రెట్లకు వైర‌స్ ప‌ట్టుకుని ఉన్నా.. అప్పుడు కూడా ప‌రిస్థితి ఇలాగే ఉంటుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది. స్మోకింగ్ చేసేవాళ్ల‌కు సాధార‌ణంగా ఊపిరితిత్తుల స‌మ‌స్య ఉంటుంది. వారి లంగ్ కెపాసిటీ కూడా త‌క్కువ‌గా ఉంటుంది. అయితే కోవిడ్19 ప్ర‌బ‌లుతున్న స‌మ‌యంలో.. అలాంటి స్మోక‌ర్లు వైర‌స్ వ‌ల్ల మ‌రింత బ‌ల‌హీనంగా మారే ప్ర‌మాదం ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రించింది.