కరోనా వైరస్ కన్నీటి ద్వారా వ్యాపిస్తుందా?
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించదని వైద్యులు స్పష్టం చేశారు. కానీ, తుమ్మినపుడు, దగ్గినపుడు వచ్చే నీటి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందని తేల్చారు. అయితే, మరికొంతమందికి కన్నీటిద్వారా వ్యాపిస్తుందా అనే సందేహం ఉత్పన్నమవుతోంది.
ఇదే అంశంపై సింగపూర్ వైద్యులు పరిశోధనలు జరిపారు. వీరి పరిశోధనల్లో కరోనా సోకినవారి కన్నీరు మన మీద పడినా.. దాన్నుంచి వైరస్ వ్యాపించదని, ఆ నీటిలో వైరస్ ఉండదని నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ పరిశోధకులు తెలిపారు.
ఈ అధ్యయనంలో భాగంగా వారు కొవిడ్-19 బారిన పడిన 17 మంది కన్నీటి చుక్కలను వారికి నయమయ్యే దాకా రోజూ సేకరించి పరీక్షించారు. రోగుల ముక్కు, నోటి స్రావాల్లో ఉన్న వైరస్.. వారి అశ్రువుల్లో మాత్రం లేదని వారి పరీక్షల్లో తేలింది.