Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలను సాధిస్తున్న నెల్లూరు జిల్లా

Written By వి
Updated: సోమవారం, 31 ఆగస్టు 2020 (15:51 IST)
కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతున్నది. దీనికితోడు అనేక మంది కరోనాతో ప్రాణాలను కోల్పోతున్నారు. కరోనా నిమిత్తం కోలుకున్న వారు ప్లాస్మా దానం అందించడంతో కొంతమంది తమ ప్రాణాలను రక్షించుకుంటున్నారు. దీంతో వివిధ జిల్లాలలో ప్లాస్మా థెరఫీని ప్రారంభిస్తున్నారు.
 
కరోనా నుండి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయడం వల్ల అవి కరోనా రోగుల శరీరంలో రోగనిరోధక శక్తిని సంతరించుకుని వైరస్‌ను అంతం చేయడంలో దోహదకారిగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వల్ల అధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు.
 
దీంతో నెల్లూరు జిల్లాలో ప్లాస్మా థెరఫీని ప్రారంభించిన వైద్యులు మంచి ఫలితాల్ని చవిచూసారు. కరోనా నుండి కోలుకున్న దాదాపు 130 మంది ప్లాస్మా దానం చెయ్యడంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్న 75 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చెయ్యడం వలన ప్రాణాంతక స్థితిలో ఉన్నవారికి రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, తద్వారా కరోనా రోగుల శరీరంలో వైరస్‌తో పోరాడి వాటిని అంతం చేస్తున్నాయని వైద్య నిపుణులు తెలియజేశారు.
 
ప్లాస్మా దానం వలన 55 శాతం అవి శరీరంలోని ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలను సంతరింప చేసి అవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని వీటి వల్ల రోగి త్వరగా కోలుకునే అవకాశమున్నట్లు వైద్యులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో అధిక సంఖ్యలో కరోనా బాధితులకు ప్లాస్మా థెరఫీ అందించడం వల్ల మంచి ఫలితం లభించిందని వైద్యులు తెలిపారు. దీంతో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం నెల్లూరు జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ ప్లాస్మా థెరఫీకి కావలసిన పరికరాలను సమకూర్చడానికి కావలసిన సహాయం అందించారు.

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments