శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 29 ఆగస్టు 2020 (22:56 IST)

కరోనావైరస్: పండ్లు, కూరగాయలను ఎలా శుభ్రం చేసుకోవాలి?

కరోనావైరస్ వ్యాప్తి నేపధ్యంలో కూరగాయలు, పండ్లను శుభ్రపరచడం ఓ సవాలే. ఐతే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలను సూచించింది. పండ్లు, కూరగాయల ద్వారా కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి జాగ్రత్తలు తెలిపింది.
 
అమ్మకందారుల నుండి కొనుగోలు చేసిన పండ్లు మరియు కూరగాయలను వారి ప్యాకేజింగ్‌లోనే ఇంటి ప్రాంగణంలో ఓ మూలలో కొంతసేపు ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని ఉపయోగించి కూరగాయలను బాగా కడగాలి. ప్రత్యామ్నాయంగా, 50-పిపిఎమ్ క్లోరిన్ చుక్కలను వెచ్చని నీటిలో వేసి, ద్రావణంలో ఉత్పత్తులను ముంచవచ్చు.
 
కూరగాయలు మరియు పండ్లను శుభ్రమైన నీరు లేదంటే త్రాగునీరు ఉపయోగించి శుభ్రం చేయాలి. వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రిమిసంహారకాలు, సబ్బులు లేదా శుభ్రపరిచే ఇతర రసాయనాలు వీటిని తుడిచేందుకు వాడకూడదు.
 
రిఫ్రిజిరేటర్‌లో ఉంచాల్సిన కూరగాయలు, పండ్లను అక్కడే నిల్వ చేసుకోవాలి. ఇతర ఉత్పత్తులను గది ఉష్ణోగ్రత వద్ద ర్యాకుల్లో కానీ బుట్టల్లో ఉంచాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. కూరగాయలు, పండ్లను కడగడానికి ఉపయోగించే సింక్ మరియు ప్లాట్‌ఫాం శుభ్రం చేయాలి. సింక్ లేదా ప్లాట్‌ఫాం నుండి నేలమీద ఇవి పడిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ జారిపడిపోతే వెంటనే నేలని తుడిచివేయాలి.